స్మార్ట్ థింకింగ్.. వ్యాక్సిన్ తీసుకుంటే.. సగం ధరకే పార్లర్ సేవలు

by  |
Hair-Cutting-saloon
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికీ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రతికూల ప్రభావం చూపుతున్నద‌న్న ప్రచారం కార‌ణంగా కొంత‌మంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై అవేర్‌నెస్ కల్పించేందుకు తమిళనాడులో మధురైలోని ఓ హెయిల్ కటింగ్ సెలూన్ ఓనర్ కార్తికేయన్ ట్రెండీగా థింక్ చేశారు. ఎవరైనా సరే వ్యాక్సిన్ తీసుకున్నట్టు తగిన సర్టిఫికెట్‌తో తన సెలూన్‌కు వస్తే వారికి 50 శాతం డిస్కౌంట్‌తో మెన్స్ బ్యూటీ పార్లర్‌లో హెయిర్ క‌ట్ చేస్తాన‌ని ఆఫర్ ఇచ్చాడు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకే తాను ఈ ఆఫర్ ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సి్న్ తీసుకుని, కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే కరోనా నుంచి బయట పడే అవకాశం ఉంటుందని కార్తికేయన్ తెలిపారు.

Next Story

Most Viewed