జులైలో సెకండ్ వేవ్ సమాప్తం.. మళ్లీ వెంటనే థర్డ్ వేవ్

by  |
జులైలో సెకండ్ వేవ్ సమాప్తం.. మళ్లీ వెంటనే థర్డ్ వేవ్
X

న్యూఢిల్లీ: దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ జులైలో ముగియనుందని ప్రభుత్వం వేసిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్యానెల్ అంచనా వేసింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉన్నదని వివరించింది. కనీసం అక్టోబర్ వరకైతే థర్డ్ వేవ్ ముప్పు ఉండకపోవచ్చునని తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, యూనియన్ సైన్స్ మినిస్ట్రీలు కరోనా మహమ్మారి ఉధృతిపై అంచనా వేయడానికి ముగ్గురు శాస్త్రవేత్తలతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది. సూత్ర విధానం(ససెప్టిబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్-పాజిటివ్, రిమూవ్డ్ అప్రోచ్) ద్వారా ఈ ప్యానెల్ మే చివరికల్లా డైలీ కేసులు 1.5 లక్షలకు, జూన్ చివరకు 20వేలకు పడిపోతాయని అంచనా వేసింది.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్తాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలు పీక్ స్టేజ్‌ను దాటాయని ప్యానెల్ సభ్యులు, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వెల్లడించారు. థర్డ్ వేవ్ ఇంతటి భయానకంగా ఉండకపోవచ్చునని, ‘ఎందుకంటే అప్పటికల్లా చాలా మంది టీకాలు తీసుకుని ఉంటారని అన్నారు. అయితే, ఈ కమిటీ దేశంలోని సెకండ్ వేవ్ తీరును సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించింది. సాధారణంగా పాలసీలను పొందించుకోవడానికి ఇలాంటి ప్యానెల్‌ను ప్రభుత్వాలు వేస్తుంటాయి.

Next Story