ఉస్మానియా ఆస్పత్రిలో తాగుబోతు వీరంగం.. ఓ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలు

by  |
ఉస్మానియా ఆస్పత్రిలో తాగుబోతు వీరంగం.. ఓ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలు
X

దిశ, గోషామహల్ : ఉస్మానియా దవాఖానలో తాగుబోతు వీరంగం సృష్టించిన సంఘటన కలకలం రేపింది. ఈ మేరకు బుధవారం ఉస్మానియా ఆస్పత్రి ఓపి గేట్ వద్దకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రోగి సహాయకుడు మద్యం సేవించి వచ్చాడు. అయితే గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు తిరుపతి మద్యం సేవించి ఉన్న రోగి సహాయకుడిని ఆసుపత్రిలోనికి అనుమతించలేదు. దీంతో సదరు తాగుబోతు సెక్యూరిటీ గార్డు పై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేయడంతో తిరుపతి ముఖంపై గాయాలయ్యాయి. గేట్ వద్ద ఉన్న పోలీస్ పోస్ట్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎంత వారించిన తాగుబోతు వినకపోవడంతో అక్కడినుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై సూపర్‌ వైజర్ శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story