బీజేపీ సభలో రైతుకు గుండెపోటు

by  |
బీజేపీ సభలో రైతుకు గుండెపోటు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఖండ్వా నగరంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే సింధియా ర్యాలీకి రాకముందే సభకు వచ్చిన రైతుకు గుండెపోటు వచ్చింది. వెంటనే గమనించిన బీజేపీ కార్యకర్తలు అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతన్నీ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రైతు మరణించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రైతు మృతిపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది.

Next Story

Most Viewed