సూర్యాపేట జిల్లాలో విషాదం

by  |
సూర్యాపేట జిల్లాలో విషాదం
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని చింతలపాలానికి చెందిన పొదిలి వీరబాబు(35), మాధవి దంపతులు. అయితే ఏడాది క్రితం వీరిద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గతంలోనే ఇతర వ్యక్తులతో వివాహం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత వీరు గ్రామానికి తిరిగొచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతిచెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. కులాంతర వివాహం నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed