మరోసారి పొంగులేటితో రేవంత్ భేటీ.. MP కోమటిరెడ్డికీ కీలక బాధ్యత!

by GSrikanth |
మరోసారి పొంగులేటితో రేవంత్ భేటీ.. MP కోమటిరెడ్డికీ కీలక బాధ్యత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి మరోసారి పొంగులేటితో భేటీ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో డీకే శివకమార్ సమక్షంలో బెంగళూరులో చర్చలు జరిపిన రేవంత్.. మరోసారి నేరుగా పొంగులేటి ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. రేవంత్‌తో పాటు థాక్రే కూడా వెళ్లే అవకాశం ఉన్నదని తెలుస్తోన్నది. గాంధీభవన్‌లోని పీఏసీ మీటింగ్ తర్వాత పొంగులేటి ఇంట్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్​ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డితో కూడా భేటీ అయ్యే ఛాన్స్​ఉన్నదని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. కానీ, షెడ్యూల్​ఫిక్స్​కాలేదని చెప్పారు. మరోవైపు ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని శుక్రవారం ఉదయం స్వయానా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేశారు. ఆయనతో కూడా ఈ రోజు రాత్రికి మరోసారి రేవంత్ టీమ్​సంప్రదించనున్నారు. రేపు(ఆదివారం) గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ ఒత్తిడి తెస్తున్నట్లు సమచారం. దీంతో పాటు కాంగ్రెస్​నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులను ఘర్​వాఫసీ పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

చేరికల ఆపరేషన్​ షురూ...

కాంగ్రెస్‌లో చేరికల ఆపరేషన్​మొదలైంది. దీనిలో భాగంగానే శనివారం బీఆర్‌ఎస్​ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిని, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్​రావ్ థాక్రే ప్రత్యేకంగా కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తుందని, మీరంతా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరారు. ఇప్పటికే పార్టీ ఇంటర్నల్‌గా నిర్వహించిన మూడు సర్వేల్లోనూ కాంగ్రెస్​పార్టీ సగటును70 సీట్లకు తగ్గకుండా గెలుస్తుందని నివేదికలు వచ్చాయని, ప్రజల్లో మార్పు మొదలైందని థాక్రే నాగంకు వివరించారు. అయితే ఆలోచించి తమ నిర్ణయాన్ని చెబుతామని ఆ ఇరువురి నేతలు థాక్రేతో చెప్పినట్లు సమాచారం.

రాజగోపాల్​ రెడ్డి బాధ్యత వెంకట్ రెడ్డికే..!

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని మళ్లీ పార్టీలోకి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను హైకమాండ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. దీంతోనే ఆయన తాజాగా ప్రియాంక గాంధీని కలిసినట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఇలా అసంతృప్తి నేతలు, గతంలో పార్టీ‌ను వదిలిన నేతలను ఈ నెలాఖరున సభలు నిర్వహించి చేర్చుకోవాలని పార్టీ భావిస్తున్నది. దీంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు క్యాడర్లో జోష్ నింపుతాయని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి.

Next Story