తెలంగాణ ఇన్‌చార్జిగా డీకే శివకుమార్.. క్లారిటీ ఇచ్చిన థాక్రే

by Disha Web Desk 2 |
తెలంగాణ ఇన్‌చార్జిగా డీకే శివకుమార్.. క్లారిటీ ఇచ్చిన థాక్రే
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే పేర్కొన్నారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ.. రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇన్‌చార్జిగా వస్తున్నారనేది అవాస్తవం అని కొట్టిపారేశారు. వివిధ పార్టీల సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కబెట్టి కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

కాగా, కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌ తెలంగాణ ఇన్‌చార్జిగా రాబోతున్నారంటూ వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. ఆయన్ను తెలంగాణకు పంపించి.. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలని అప్పగించాలని పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్ రావు థాక్రే ఉన్నారు. ఆయన్ను కంటిన్యూ చేస్తూనే.. అదనంగా డీ‌కేని ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ నేతలను సమన్వయం చేసుకుని అక్కడ అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేలా డీకే ఎంట్రీపై మాణిక్ థాక్రే క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed