War Begin: వార్ సైరన్ మోగించిన భారత సైన్యం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-09 16:34:05  IST  )

పాకిస్తాన్(Pakistan) వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)ను మరోసారి బ్లాక్ అవుట్ చేశారు.

War Begin: వార్ సైరన్ మోగించిన భారత సైన్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)ను మరోసారి బ్లాక్ అవుట్ చేశారు. జమ్మూ టార్గెట్‌గా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొటోంది. యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ బలగాలు పాల్పులకు తెగబడ్డాయి. దీంతో చూసి చూసి సహనం నశించిన భారత సైన్యం.. ప్రతిదాడులకు దిగింది. ఎల్‌వోసీ సరిహద్దుల్లో వార్ సైరన్ మోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సర్వీసులు నిలిపివేశారు. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌కు ఈనెల 15 వరకు ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిపివేశారు. మొత్తం 11 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడగా, భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది.

READ MORE ...

పాక్‌కు న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేయడం అంత ఈజీనా?


Next Story