ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి 2898ఏడి’ సినిమా.. ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్!

by Hamsa |
ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి 2898ఏడి’ సినిమా.. ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్!
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ ‘కల్కి2898ఏడి’. ఈ సినిమా జూన్ 27న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటూ.. కోట్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. రూ. 1000 కోట్ల మార్క్‌కు చేరులో ఉంది ఈ మూవీ. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికే మూవీ చూసినప్పటికీ కల్కి ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్లీ చూద్దామా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, మేకర్స్ మాత్రం 7-8 వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ముందే ప్లాన్ చేసుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దీంతో ఇక ఇప్పట్లో కల్కి ఓటీటీలోకి రానట్లేనా అని సినీ ప్రియులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, కల్కి ఓటీటీలోకి రానున్నట్లు వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ సంతోషానికి కారణమైంది. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్షిణాది భాషలకు సంబంధించి అమెజాన్ ప్రైమ్, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే కల్కి సినిమా ఆగస్ట్ 15న ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వీకెండ్ రాబోతుండటంతో చాలామంది చూస్తారని ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. అందుకే ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Next Story

Most Viewed