- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
CM రేవంత్‌కు కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ ఆపలేరు.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా సోదరులం చెరో భుజంగా ఉన్నామని అన్నారు. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఎవరూ తట్టుకోలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
భువనగిరి పార్లమెంట్ సీటును గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాదే అని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి చూసుకుంటారు.. గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లుగా 12లో 11 స్థానాలు గెలుచుకున్నాం.. సూర్యాపేట సీటు కొంచెంలో మిస్ అయింది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్‌కు బంపర్ మెజార్టీ రాబోతోందని జోస్యం చెప్పారు.