నేడే KCR పార్లమెంట్ ఎన్నికల శంఖారావం

by GSrikanth |
నేడే KCR పార్లమెంట్ ఎన్నికల శంఖారావం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 16న మెదక్ బహిరంగ సభ నిర్వహంచనున్నారు. అయితే, ఇవాళ చేవెళ్లలో నిర్వహించే సభ తొలి సభ కావడంతో గులాబీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తుచేస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్‌ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపనున్నట్టు తెలుస్తున్నది.Next Story

Most Viewed