క్రిమినల్ కేసుల్లో ఒవైసీ.. ఆస్తుల్లో మాధవీలత టాప్

by Disha Web Desk |
క్రిమినల్ కేసుల్లో ఒవైసీ.. ఆస్తుల్లో మాధవీలత టాప్
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎంఐఎంకు కంచుకోట. ఒవైసీ బ్రదర్స్‌దే అక్కడ హవా. గడిచిన మూడు దశాబ్దాలలో ఏ పార్టీ కూడా పాతబస్తీలో పాగవేయలేకపోయింది. పాత బస్తీలో కాలుమోపాలని ఎన్నో రాజకీయ పార్టీలు ప్రయత్నించి చతకిల పడ్డాయి. తాజాగా ఒవైసీ సోదరులపై పైచెయ్యి సాధించేందుకు బీజేపీ నడుం బిగించింది. ఇందులో భాగంగా అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి సామాజిక వేత్త, విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్ కొంపెల్ల మాధవీలతను బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆమె తనదైన శైలీలో వినూత్నంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతుంది.

ఇదీలా ఉండగా.. తాజాగా నామినేషన్ల సందర్భంగా మాధవీలత ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను ప్రకటించింది. తన సమీప ప్రత్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అంటే అధిక రెట్లు ఆస్తులను కలిగి ఉంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన మాధవీలతకు రూ. 221.38 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపింది. చరస్తులు రూ.165. 46 కోట్లు, స్థిరాస్థులు రూ.55.92 కోట్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ. 56.19 కోట్ల విలువైన షేర్లు, విరా సిస్టమ్స్, పీకేఐ సొల్యూషన్స్, గజ్వేల్ డెవలపర్స్‌లో తన పేరిట రూ. 16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ. 29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉందన్నారు. అప్పు రూ.27.03 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. తనకు సొంత వాహానం, భూములు లేవన్న ఆమె.. తనపై ఒక క్రిమినల్ కేసు ఉందని ఆమె తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

ఇక ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రూ.23.87 కోట్ల ఆస్తులను ప్రకటించారు. చరాస్తులు (నగదు, బంగారం, బీమా మొదలైనవి) అసదుద్దీన్ ఒవైసీ పేరు మీద రూ.2.80 కోట్లు, జీవిత భాగస్వామి పేరు మీద రూ.15.71 కోట్లు, స్థిరాస్తులు (భూమి- వాణిజ్య & వ్యవసాయం) ఒవైసీ పేరు మీద రూ.16.01 కోట్లు, భార్య పేరు మీద రూ. 4.90 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.7 కోట్లు అప్పులు ఉన్నట్లు తెలిపిన ఒవైసీ.. ఆయుధాలు ఒక NP బోర్ .22 పిస్టల్, NP బోర్ 30-60 రైఫిల్ ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. లండన్‎లో బార్-అట్-లా, ఎల్ఎల్‎బి లింకన్స్ ఇన్ చదువుకున్న తనపై.. 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని వివరించారు.



Next Story

Most Viewed