బీఆర్ఎస్‌లో భగ్గుమన్న గ్రూప్ పాలిటిక్స్.. నిండు సభలో మాజీ MLA చేతిలోంచి మైక్ లాక్కున్న MP

by GSrikanth |
బీఆర్ఎస్‌లో భగ్గుమన్న గ్రూప్ పాలిటిక్స్.. నిండు సభలో మాజీ MLA చేతిలోంచి మైక్ లాక్కున్న MP
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌లో గ్రూపు పాలిటిక్స్ భగ్గుమన్నాయి. నిండు సభలో ఇద్దరు జిల్లా కీలక నేతలు ప్రవర్తించిన తీరు కార్యకర్తలను, మండల స్థాయి నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంగళవారం మహబూబాబాద్‌లో ఎంపీ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ నేతలిద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. నిండు సభలో శంకర్ నాయక్ మాట్లాడుతుండగా.. ఎంపీ కవిత ఆయన చేతిలోంచి మైక్ లాక్కున్నారు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపు మైక్ కోసం గొడవ పడ్డారు. అనంతరం పెద్దల సూచనలతో గొడవ సర్దుమణిగింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అయోమయంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్‌సభ ఎన్నికలపై సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో లీడర్ల మధ్య సమన్వయం లోపించడం అటు అధిష్టానాన్ని, ఇటు కార్యకర్తలను కలవరపాటుకు గురిచేస్తోంది. మరి ఈ పరిణామాలపై గులాబీ బాస్ ఫోకస్ చేస్తారో లేదో చూడాలి.

Advertisement

Next Story