వారిని చీపుర్లతో కొట్టి తరిమేయండి.. హరీష్ రావు సంచలన పిలుపు

by Disha Web Desk 2 |
వారిని చీపుర్లతో కొట్టి తరిమేయండి.. హరీష్ రావు సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్ర మహిళలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన పిలుపు ఇచ్చారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయండి అని పిలుపునిచ్చారు. గురువారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. ఎక్కడ అమలయ్యాయో చూపించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ అయిన రైతులంతా కాంగ్రెస్‌కే ఓటేయండి అని చెప్పారు.

రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్‌కు ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అన్నారు. రైతులంతా కన్నీరు పెట్టుకునే పరిస్థితులు దాపురించాయని.. వీటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు, పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాడని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు.. ఎంపీగా ఎలా గెలుస్తాడని ఎద్దేవా చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed