బ్రేకింగ్: ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ గుడ్ బై

by Satheesh |
బ్రేకింగ్: ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ గుడ్ బై
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా ఐపీఎల్‌కు సైతం గుడ్ బై చెప్పారు.

ఈ సీజన్‌లో ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయుడు.. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తన చివరి మ్యాచ్ అని ప్రకటించాడు. రిటైర్మెంట్ విషయంలో గతంలో మాదిరిగా యూ టర్న్ తీసుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తనకు సహకరించిన ఫ్రాంచైజ్‌లకు, ఆటగాళ్లకు, సిబ్బందికి ఈ సందర్భంగా రాయుడు ధన్యవాదాలు తెలిపాడు.

ఇదిలా ఉండగా.. ఇవాళ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ ధోని సారథ్యంలో చెన్నై, యంగ్ ఆల్ రౌండర్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో ఫైనల్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read..

ఇవాళే నా చివరి మ్యాచ్ : అంబటి రాయుడు

Advertisement

Next Story

Most Viewed