ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌

by Mahesh |
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌల్ ఖలీల్ అహ్మద్ మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఢీల్లీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఖలీల్ అహ్మద్ నిలిచాడు. 25 ఏళ్ల అతను IPLలో 50 వికెట్లను చేరుకోవడానికి 35 మ్యాచ్‌లు తీసుకున్నాడు. కాగా గతంలో ఈ రికార్డ్ భారత్ మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేరు మీద ఉంది. అతను 50 వికెట్లు తీసుకోవడానికి 37 మ్యాచులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ గతంలో ఎక్కువ కాలం SRH జట్టు తరఫున ఆడిన వారు కావడం విశేషం.

Next Story