IPL 2023: అతడికి ఆర్సీబీ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే.. కనీసం మూడు ట్రోఫీలో గెలిచేది : వసీం అక్రమ్

by Vinod kumar |
IPL 2023: అతడికి ఆర్సీబీ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే.. కనీసం మూడు ట్రోఫీలో గెలిచేది : వసీం అక్రమ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో.. ఎంఎస్ ధోనీకి ఆర్సీబీ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే ఏమై ఉండేదని అడగగా.. వసీం అక్రమ్ అసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆర్సీబీ కనీసం 3, 4 ట్రోఫీలు గెలిచేదని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. రన్ మిషన్, టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ లో ఉన్నాడు. ధోనీ కనుక ఆ టీం లో ఉండి ఉంటే.. ట్రోఫీ నెగ్గడంలో చాలా హెల్ప్‌ చేసేవాడన్నాడు. కానీ, దురదృష్టవశాత్తు ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. 2016 లో ఫైనల్ చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. ధోనీ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడని, తన ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ నింపుతాడని చెప్పాడు. దీంతో వాళ్లు స్టేడియంలో అద్భుతంగా ఆడతారన్నాడు.

Next Story