IPL 2023: రిటైర్మెంట్‌పై ధోనీని ఎందుకు విసిగిస్తారు.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఫైర్

by Disha Web Desk 13 |
IPL 2023: రిటైర్మెంట్‌పై ధోనీని ఎందుకు విసిగిస్తారు.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఫైర్
X

చెన్నై: ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పదే పదే అడిగి ఎందుకు విసిగిస్తారో అర్ధం కావడం లేదంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ అన్నారు. ఈ సీజన్ ఐపీఎల్ లో అతడు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడని, జట్టును పలుసార్లు గెలిపించాడని గుర్తు చేశారు.

గొప్ప అనుభవజ్ఞుడైన కీపర్ కూడా అయిన ధోనీ వచ్చే సీజన్ లోనూ ఆడాలనే ఆకాంక్షను సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ పై ప్రశ్నలకు ధోనీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, అది ఆయనకు మాత్రమే తెలిసిన విషయమని చెప్పారు. సరైన సమయంలో అభిమానులందరికీ తెలిసేలా జార్ఖండ్ డైనమెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని పేర్కొన్నారు.

లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్ కు ముందు టాస్ సందర్భంగా ధోనీని ‘మీకు ఇదే చివరి సీజన్ కదా’ అని కామెంట్రేటర్ డానీ మోరిసన్ ప్రశ్నించారు. ‘నాకు ఇదే చివరి సీజన్ అని మీరు డిసైడ్ అయ్యారు. నేను కాదు’ అంటూ ధోనీ తిప్పికొట్టారు. దీంతో కంగుతిన్న మోరిసన్.. ‘నీవు వచ్చే ఏడాది కూడా ఆడతావని తెలుసు’ అని సరిదిద్దుకున్నారు.



Next Story