ఆర్సీబీపై ఓటమి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ కామెంట్స్

by Satheesh |
ఆర్సీబీపై ఓటమి.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లోనే క్రికెట్‌ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన మ్యాచ్‌గా చెన్నె సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ నిలిచింది. ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లీగ్ దశలో ఇరు జట్లకు చివరిది కావడంతో పాటు.. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఐపీఎల్‌లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం కావడంతో పోరు ఆసక్తిగా మారింది. ఇక, మ్యాచ్‌లో బెంగుళూరు చెన్నైను చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడినప్పటికీ క్రికెట్ ప్రియులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే, కీలకమైన మ్యాచ్‌లో ఓడిపోవడంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై లీగ్ దశ నుండే నిష్క్రమించడం చాలా బాధగా ఉందన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి ప్లే ఆఫ్స్‌కు చేరుకోకపోవడం కాస్త ఇబ్బందిగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

ఆదివారం బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో గతేడాది ఫైనల్ సీన్ రిపీట్ అవుతుందనుకున్నానని, ఆ మ్యాచ్‌లో కూడా సేమ్ ఇలాగే చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసి విజేతగా నిలిచామని గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అలాగే జరుగుతుందనుకున్నప్పటికీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదన్నాడు. చివరి ఓవర్లో బెంగుళూర్ బౌలర్ యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ఈ సీజన్‌లో తమ జట్టులోని కీలక ప్లేయర్స్ చాలా మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కాస్త నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed