రికార్డు సృష్టించిన భారత్.. చరిత్రలో తొలి జట్టు పేరు నమోదు

by Mahesh |
రికార్డు సృష్టించిన భారత్.. చరిత్రలో తొలి జట్టు పేరు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు మొదటి నుంచి భీకర ఫామ్ కొనసాగించింది. ఈ సిరీస్ లో అత్యధిక స్కోరును చేయించడంతో పాటు.. అత్యల్ప స్కోరును కాపాడుకొని ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికా పై అనూహ్యంగా విజయం సాధించిన భారత్ టీ20 వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించింది. టోర్ని మొత్తంలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్ సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లను ఓడించి.. సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. అలాగే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఈజీ విజయాన్ని అందుకున్న భారత్ సెమీఫైనల్ మ్యాచ్ లో త్రిల్లింగ్ విక్టరీ అందుకొని చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ ఇప్పటి వరకు గెలిచిన 2007, 2024 వరల్డ్ కప్‌లలో మొదట బ్యాటింగ్ చేసి విజయాలను అందుకోగా మిగిలిన 6 ఫైనల్ మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed