విద్యుత్ షాక్ తో మహిళ మృతి

by Sridhar Babu |
విద్యుత్ షాక్ తో మహిళ మృతి
X

దిశ, లక్షెట్టిపేట : మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన పనాస లక్ష్మి (52) అనే మహిళ బుధవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. స్థానిక ఎస్సై పి. సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతురాలు తన ఇంటి సమీపంలో కూరగాయలు సాగు చేస్తున్న తమ భూమి వద్దకు పని చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పని చేస్తుండగా పక్క పొలం వారు వేసిన సరిహద్దు గెట్టుపై కరెంటు సరఫరా

ఉన్న ఫెన్సింగ్ తీగకు కు తగిలి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కాగా పక్క పొలం వారితో భూ వివాదాలు ఉండగా చంపుతామని బెదిరించారని, ఫెన్సింగ్ తీగ కు కరెంట్ వైర్ అమర్చారని మృతురాలి కూతురు సౌందర్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని లక్షెట్టిపేట సీఐ నరేందర్ పరిశీలించారు.Next Story

Most Viewed