అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

by Kalyani |
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆర్యనగర్ కు చెందిన వివాహిత లావణ్య(23) అత్తింటి వేధింపులు భరించలేక తనువు చాలించిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్ కు చెందిన వెంకటేశ్ తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్ లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. అత్తింటి వేధింపుల వల్లే లావణ్య సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబీకులు మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story