రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..

by Sumithra |
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇరువురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సైదాపూర్ మండలం బూడిదపల్లి గ్రామానికి చెందిన పడాల వెంకటస్వామి తన భార్య రాజేశ్వరితో కలిసి మొలంగూరు గ్రామానికి వెళుతున్నారు.

ఎదురుగా మొలంగూరు గ్రామవాసి తడిగొప్పుల సంపత్ కూడా తన ద్విచక్రహాహనం పై వస్తున్నారు. ఎదురెదురుగా వస్తూ ఇరువురి వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అటుగా వెళుతున్న స్థానికులు 108కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.Next Story

Most Viewed