రెండు బైకులు ఢీ.. రోడ్డుపై ఎగిరిపడ్డ చిన్నారి..!

by Disha Web Desk 9 |
రెండు బైకులు ఢీ.. రోడ్డుపై ఎగిరిపడ్డ చిన్నారి..!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు మధురై నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధురై నుంచి ఉత్తంగుడి వెళ్లే రోడ్డులో చిన్నారికి పెనుప్రమాదం తప్పింది. బెక్‌పై వెళ్తోన్న తండ్రి కూతుళ్లను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి రోడ్డుపై ఎగిరిపడింది. అదృష్టవశాత్తు బాధితులు చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తమిళనాడు మధురై నగరం నుంచి ఉత్తంగుడి వెళ్లే రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగూనే ఉంటాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనదారులకు కీలక సూచనలు చేశారు.

Next Story

Most Viewed