- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పండగ పూట ఎల్బీనగర్‌లో విషాదం.. కైట్ ఎగురవేస్తూ భవనంపై నంచి పడి బాలుడి దుర్మరణం
దిశ, ఎల్బీనగర్ : సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కైట్ ఎగురవేస్తూ.. ఓ బాలుడి భవనం పైనుంచ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుమారుడు శివకుమార్ (13) నాగోల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు రావడంతో తోటి స్నేహితులతో శనివారం సాయంత్రం ఇంటి పైకి ఎక్కి కైట్ ఎగురవేస్తున్నాడు. ఈ సమయంలో గాలి రాకపోవడంతో పక్క బిల్డింగు పైకి వెళ్లి తోటి స్నేహితులతో కైట్ ఎగురేస్తుండగా ఆ ఇంట్లోని కుక్క అతడిపైకి ఎగబడింది. దీంతో భయపడిన శివకుమార్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కు వెళ్లగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హఠాత్పరిణామంతో శివ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. తోటి స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.