హఫీజ్ పేట్ లో తీవ్ర విషాదం…గోడకూలి 3ఏళ్ల బాలుడు, ఇటుకలు పడి మరో వ్యక్తి మృతి

by Kalyani |
హఫీజ్ పేట్ లో తీవ్ర విషాదం…గోడకూలి 3ఏళ్ల బాలుడు, ఇటుకలు పడి మరో వ్యక్తి మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లిలో మరోసారి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి గోడకూలిన ఘటనలో ఒక చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ హాఫీజ్ పేట్ సాయినగర్ లో గాలి వాన బీభత్సానికి ఒక ఇంటి బాల్కనీ కూలి పక్కన ఉన్న రేకుల ఇంటిపై పడింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి సమాద్ ( 3 ) మీద గోడ శిథిలాలు పడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న రషీద్ (45)పై ఇటుకలు పడి గాయాలు అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న మియపూర్ పోలీసులు గాయాలైన బాలుడు సమాద్, రషీద్ ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు సమాద్ తో పాటు రషీద్ కూడా మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేరుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story