మంచిర్యాలలో పండుగపూట విషాదం

by Sumithra |
మంచిర్యాలలో పండుగపూట విషాదం
X

దిశ, మంచిర్యాల టౌన్ : పండుగపూట ఓ ఇంట విషాదం నెలకొంది. వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే లేచి పూజ చేసేందుకు సిద్ధం అయిన ప్రైవేట్ లెక్చరర్ ఒకరు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రాపల్లీ గ్రామానికి చెందిన ఒరగంటి శంకర్ 46 మంచిర్యాలలోని ప్రేరణ డిగ్రీ కళాశాలలో ప్రైవేట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటున్న శంకర్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు మెడిలైఫ్ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనితో శంకర్ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.Next Story

Most Viewed