పండుగ పూట పెళ్లింట్లో తీవ్ర విషాదం.. ముగ్గురు దుర్మరణం

by Disha Web Desk 2 |
పండుగ పూట పెళ్లింట్లో తీవ్ర విషాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుమీద నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న పాదచారులతో పాటు మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం పంపనూరులో శనివారం అర్ధరాత్రి వివాహ ఊరేగింపు కార్యక్రమం జరుగింది. ఈ క్రమంలో కళ్యాణ్ దుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒకసారిగా వారి మీద నుంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అదే బొలేరో వాహనం మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రామప్ప, అనిల్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. క్షతగాత్రులందరినీ చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యా్ప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed