బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. యువకుడు దుర్మరణం

by Rajesh |
బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. యువకుడు దుర్మరణం
X

దిశ, నవీపేట్ : మండలంలోని సిరన్పల్లి సమీపంలో శుక్రవారం రాత్రి టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సిరన్ పల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (18) అనే యువకుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపూర్ నుంచి జన్నేపల్లి వెళ్తున్న టిప్పర్, జన్నేపల్లి నుండి సిరన్ పల్లికి బైక్‌పై వస్తున్న షేక్ హుస్సేన్‌ను గ్రామ కమాన్ వద్ద ఢీ కొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story