- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ లేడీ డాక్టర్ లిప్ స్టిక్ ధర అక్షరాల రూ.లక్ష.. ఆర్డర్ ప్రతినిధిపై పోలీసులకు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ డెవలప్ కావడంతో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. ఒక్క చిన్న మెసేజ్ పంపి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. ఓ మహిళ కేవలం రూ. 300 లిప్ స్టిక్ ఆర్డర్ పెడితే.. ఆమె అకౌంట్లో నుంచి ఏకంగా లక్ష రూపాయిలు కట్టయ్యాయి. అసలు ఏం జరిగిందనే విషయాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన ఓ మహిళా డాక్టర్ ఈ నెల 2న ఆన్ లైన్‌లో రూ. 300 విలువ చేసే లిప్ స్టిక్ ఆర్డర్ చేశారు. కొన్ని రోజులకు ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మీ ఆర్డర్ వచ్చింది.. కానీ కొన్ని వివరాల కోసం తమ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడాలి’ అని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో ఆమె కొరియన్ కంపెనీ నంబర్‌ను సంప్రదించగా.. అటువైపు నుంచి స్పందించిన వ్యక్తి సేమ్ కస్టమర్ కేర్ ప్రతినిధిలా మాట్లాడి ఆమెను నమ్మించాడు. మీ ఆర్డర్ హోల్డ్‌లో పడింది మేడం. అది కన్ఫామ్ చేసుకోవడం కోసం మీరు రెండు రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. దాని కోసం బ్యాంక్ వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుందని వెబ్ లింక్ సెండ్ చేశాడు.
అంతే కాకుండా మీకు కలిగిన అసౌకార్యానికి చింతిస్తున్నాము. ఇంకోసారి ఇలా జరక్కుండా చూసుకుంటామని ఆమెను క్షమాపణలు కోరాడు. అది నమ్మన మహిళ కేవలం రెండు రూపాయిలే కదా అన్నట్లుగా అతడు పంపిన లింక్ ఓపెన్ చేసి బ్యాంక్ డిటేల్స్ ఫిల్ చేసింది. వెంటనే ఆమె మొబైల్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. మొదట ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇక నవంబర్ 9న ఆమె అకౌంట్లో నుంచి అక్షరాల లక్ష రూపాయిలు కట్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కాబట్టి.. ఇక నుంచైనా ఆన్ లైన్ పేమెంట్స్, తెలియని వ్యక్తులు పంపించిన లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.