మహిళా అత్యాచారం హత్య కేసును చేధించిన కూకట్​పల్లి పోలీసులు

by Disha Web Desk 23 |
మహిళా అత్యాచారం హత్య కేసును చేధించిన కూకట్​పల్లి పోలీసులు
X

దిశ,కూకట్​పల్లి: మహిళా అత్యాచారం, హత్య కేసును కూకట్​పల్లి పోలీసులు మూడు రోజులల చేధించారు. కూకట్​పల్లి వై జంక్షన్​ నుంచి పటాన్​ చెరువు వరకు సుమారు 12 వందల సీసీ కెమెరాల్లో గాలించి నిందితులను సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్​. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస​ రావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ తేదిన కూకట్​పల్లి వైజంక్షన్​లోని ఓ దుకాణంలోని సెల్లార్​లో రక్తపు మడుగులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు ఏసీపీ తెలిపారు. వై జంక్షన్​ నుంచి పటాన్​ చెరువు వరకు ఉన్న సుమారు 12 వందల సీసీ కెమెరాలను గాలించి నిందితుల ఆచూకీ తెలుసుకుని సంగారెడ్డిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బీహార్​కు చెందిన నితీష్​ కుమార్​ దేవ్​(24), మరొక మైనర్​ ఇద్దరు సంగారెడ్డిలోని తిరుమల బార్​ అండ్​ రెస్టారెంట్​లో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదిన బీహార్​కు వెళ్తున్న తమ స్నేహితుడిని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో దించి అక్కడి నుంచి ఏపీ 28 డిక్యూ 1352 నెంబర్​ గల బజాజ్​ పల్సర్​ బైక్​పై​ సంగారెడ్డికి బయలు దేరారు. ప్రశాంత్​నగర్​ వద్దకు చేరుకున్న తరువాత అక్కడ టీ తాగడానికి ఆగిన క్రమంలో సమీపంలో ఉన్న ఓ మహిళ(40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు)ను గమనించి సదరు మహిళను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకు వెళ్లేందుకు పథకం పన్నారు. ప్రశాంత్​నగర్​లోన విష్ణుప్రియ లాడ్జి వద్ద సెల్లార్​ వద్ద నిర్మానుష్యంగా ఉండడాన్ని గమనించిన ఇద్దరు నిందితులు మహిళను అక్కడికి లాక్కెళ్లారు. మహిళా నిరాకరించడంతో మహిళను కాళ్లు పట్టుకుని సెల్లార్​లోకి లాక్కెళ్లారు. మహిళపై అత్యాచారానికి ప్రయత్నించడంతో మహిళా ప్రతిఘటించింది.

దీంతో మహిళ తలను బలంగా నెలకు వేసి బాదడంతో మహిళ తలకు బలమైన గాయం అయింది. మహిళా అపస్మారక స్థితిలోకి వెళ్లిన పట్టించుకోకుండా నిందితులు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళా తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నిందితులు ఇద్దరు మహిళను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వై జంక్షన్​ నుంచి పటాన్​ చెరువు వరకు సీసీ కెమెరాలను గాలించి నిందితుల ఆనవాళ్లను, బైక్​ రిజిస్ట్రేషన్​ నెంబర్​ ఆధారంగా దర్యాప్తు చేసి సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్​ రావు తెలిపారు. కేసును చాక చక్యంగా, తక్కువ కాలంలో చేధించేందుకు గాను సీఐ కృష్ణ మోహన్​, డీఐ వెంకన్న​, ఎస్సైలు రామకృష్ణ, ఆర్​. ప్రేమ్​ సాగర్​, జి. చంద్రకాంత్​, ఇంద్రసేనా రెడ్డి, కానిస్టేబుళ్లు ఎం. నవీన్​, ఏ. జయంత్, రాంచందర్​, ఎండి. షకీల్​లకు ఏసీపీ నగదు రివార్డును అందజేశారు.



Next Story

Most Viewed