మద్నూర్ లో పట్టపగలే దొంగల హల్చల్

by Disha Web Desk 20 |
మద్నూర్ లో పట్టపగలే దొంగల హల్చల్
X

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లామద్నూరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గాంధీ చౌక్ లో దొంగలు హల్చల్ చేశారు. గోవింద్ ప్రసాద్ సేటు ఇంటికి ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి బంగారు వెండి వస్తువులకు మెరుగులు ఇచ్చే పౌడర్ తమవద్ద ఉందని చెప్పారు. గోవింద్ ప్రసాద్ భార్య పుష్ప ఆమె బంగారు పుస్తెలతాడును వారికి ఇచ్చి ఇంటిలోకి నీళ్ల గురించి వెళ్లగానే వారు ఆ పుస్తెలతాడును తీసుకొని పరారయ్యారు.

కేసునమోదు చేసుకున్న మద్నూర్ పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చినట్టుగా తెలుస్తున్నది. వారి గురించి పోలీసులు గాలిస్తున్నారని మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ విషయమై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు.


Next Story

Most Viewed