కారు అదుపుతప్పి బోల్తా...ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 15 |
కారు అదుపుతప్పి బోల్తా...ఇద్దరు దుర్మరణం
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అక్కంపల్లి సమీపంలో ఎమ్మార్పీ ప్రధాన కాల్వ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ అజార్ (32), సమీరా (22) కారులో హైదరాబాద్

నుండి నాగార్జున సాగర్ కు మరో ఇద్దరితో కలిసి వస్తున్నారు. అజార్ అజాగ్రత్తగా కారును నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో అజార్, సమీరా మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మృతుని అన్న మహ్మద్ ఫరీద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story