చెట్టును ఢీకొన్న బైక్..యువకుడు మృతి

by Aamani |
చెట్టును ఢీకొన్న బైక్..యువకుడు మృతి
X

దిశ,చేగుంట : మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ సామాను తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో చెట్టుకు బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మక్క రాజుపేట గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మక్కరాజుపేట గ్రామానికి చెందిన మాసాని లాలు (29) తాపీ మేస్త్రి గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు సోమవారం చేగుంట మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ నిర్వహణ కోసం సామాను తీసుకురావడానికి వెళ్ళాడు తిరిగి వస్తున్న క్రమంలో మక్క రాజుపేట గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లాలుకు భార్య మూడు సంవత్సరాల కుమారుడు, రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఈ మేరకు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story