ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

by GSrikanth |
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొని అక్కడికక్కడే పది మంది దుర్మరణం చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అంబులెన్సులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Next Story

Most Viewed