అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న టాటా ఏస్ వాహనం… సేల్స్ మెన్ దుర్మరణం

by Kalyani |
అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న టాటా ఏస్ వాహనం… సేల్స్ మెన్ దుర్మరణం
X

దిశ, భిక్కనూరు : స్పీడ్ గా వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న సంఘటన లో ఒక సేల్స్ మెన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ కు చెందిన ఒక ఏజెన్సీ వారు డిస్టలరీ వాటర్ ను హోల్ సెల్ గా సప్లై చేస్తారు. అందులో భాగంగా డిస్టలరీ వాటర్ సప్లై చేసి తిరిగి కామారెడ్డి కి వెళుతుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో స్మశాన వాటిక మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సేల్స్ మెన్ శేఖర్ గౌడ్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ షాజీద్, మరో సేల్స్ మెన్ షకీర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే భిక్కనూరు ఎస్ ఐ సాయికుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Next Story