జీజీహెచ్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

by Kalyani |
జీజీహెచ్ లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ, నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్ లో దారుణ ఘటన బుధవారం చోటు చేసుకుంది. చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సుమారు 40 సంవత్సరాలు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి మరణించాడని ఆసుపత్రి సిబ్బంది గమనించడంతో వేంటనే నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

వేంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి ఎడమ చేతిపైన నాని అని పచ్చ బొట్టు వేసి ఉందని వివరించారు. అయితే అతని వద్ద నుంచి ఏలాంటి సరైన ఆధారాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు మృతి చెందిన వ్యక్తికి ఏదైన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా లేదా ఇతర ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతామని తెలిపారు.Next Story

Most Viewed