అనుమానస్పదంగా వ్యక్తి మృతి

by Disha Web Desk 23 |
అనుమానస్పదంగా వ్యక్తి మృతి
X

దిశ,వెల్గటూర్: వెల్గటూర్ మండల కేంద్రం లోని కాళేశ్వరం లింక్ టు ప్రాజెక్టు జలాశయంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నస్పూరి రాజన్న (42) అనే వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.మృతి చెందిన రాజు ముత్యంపేట లో చికెన్ సెంటర్ నిర్వహిస్తూ వంటలు వండటం కోసం అత్తగారిళ్లయిన వెల్గటూర్ మండల కేంద్రానికి అప్పుడప్పుడు వస్తుంటాడాని బంధువులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రాజక్క పల్లి గ్రామానికి వచ్చిన అతడు కనిపించకుండా పోయాడని మృతుడి బావమరిది జయేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం మిస్సింగ్ కేసు చేసి నమోదు చేశారు. అయితే అదే రోజు సాయంత్రం రాజక్కపల్లి గ్రామానికి చెందిన సత్యం ఇంటి వద్ద గొడవ జరిగిందని వారు ఇతడి పై కారం పొడి చల్లి దాడి చేసి కొట్టగా తప్పించుకొని పారిపోయి పరుగెత్తి సమీపంలోని కాళేశ్వరం లింక్ టు జలాశయంలో దూకి ఈదుకుంటూ వెళ్తున్న క్రమంలో నీట మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులుధర్మాజీ సత్యం గంగారాం అనే వారి పై అనుమానం వ్యక్తం చేయాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు.Next Story

Most Viewed