షాకింగ్ ఘటన..రేప్ బాధితురాలిని బట్టలు విప్పమన్న జడ్జి?

by Disha Web Desk 18 |
షాకింగ్ ఘటన..రేప్ బాధితురాలిని బట్టలు విప్పమన్న జడ్జి?
X

దిశ,వెబ్‌డెస్క్:మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. రోజులో ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ అమ్మాయిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో యువతి తనకు న్యాయం జరగాలని కోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలోనే అత్యాచారం కేసులో కోర్టును ఆశ్రయించిన యువతికి షాకింగ్ ఘటన ఎదురైంది. విచారణ జరపాల్సిన జడ్జినే అలా అనడం ఆ యువతిని తీవ్రంగా కలచివేసింది. రేప్ కేసు బాధితురాలి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టు లో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన ఆ యువతి జడ్జి పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.


Next Story