24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు

by Kalyani |
24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లిలో వ్యక్తి దారుణ హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. శనివారం సీఐ లక్ష్మారెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తంగడిపల్లి గ్రామానికి చెందిన రుల్లా ఖాన్‌ (58) తన భార్య జాకియా బేగం తన ముగ్గురు పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం నగరంలోని మలక్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మృతుడికి తంగడిపల్లి గ్రామంలో వ్యవసాయ పొలం ఉండడంతో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. నెల రోజుల క్రితం నుంచి మృతుడు రుల్లాఖాన్‌ వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామం తంగడిపల్లిలో ఒంటరిగా ఉంటున్నాడు.

రుల్లా ఖాన్‌ మేనల్లుడు ఖాజా పాషా గతంలో ఇద్దరు మామలు రుల్లాఖాన్‌, అన్వర్‌ పాషాలకు తనకు భూమి తలా ఇంత కేటాయించాలని కోరాడని తెలిపారు. దీంతో పెద్ద మామ అన్వర్‌ పాషా ఖాజా పాషకు రూ.14 లక్షలు ఇస్తానని అంగీరించాడని, చిన్న మామ అయిన రుల్లాఖాన్‌ను కూడా అడగడంలో రూ.లక్ష లేదా 2 లక్షలు ఇస్తానని తెలిపడంతో అందుకు అంగీకరించక మామపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. దీంతో రుల్లా ఖాన్‌ గ్రామంలో ఒంటరిగా ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ఖాజా పాష నగరంలోని ఓల్డ్​‍ సిటీ ప్రాంతంలో ఉండే తన ఇద్దరు స్నేహితులు షేక్‌ ముస్తఫా, అఫ్సర్‌ను గురువారం రాత్రి 11 గంటలకు తన మామ ఇంటికి తీసుకువచ్చి రుల్లా ఖాన్‌తో మద్యం సేవించారు.

రాత్రి రెండు గంటల సమయంలో ఖాజా పాష మామ రుల్లా ఖాన్‌ గొడవ పడి కోపేద్రేకంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరు స్నేహితుల సహాయంతో మామపై అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం వెళ్లే క్రమంలో గ్రామస్తులు గమనించి వెంబడించడంతో స్కూటీని అక్కడే వదిలి పరారయ్యారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రదీప్‌ కుమార్‌, కానిస్టేబుళ్లు రవి తదితరులు ఉన్నారు.Next Story

Most Viewed