కారు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి… మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

by Kalyani |
కారు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి… మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ, గూడూరు: కారు అతివేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిగా… మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మరిమిట్ట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రంజిత్, గూడూరు మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైధం రాజు.

ఇద్దరు స్నేహితులు నర్సంపేట నుండి మహబూబాబాద్ కు బైక్ మీద వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టడంతో కొమ్ము రంజిత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మైదం రాజు కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story