ఉరి వేసుకొని ఒకరు ఆత్మహత్య.. మరొకరు అదృశ్యం.

by Kalyani |
ఉరి వేసుకొని ఒకరు ఆత్మహత్య.. మరొకరు అదృశ్యం.
X

దిశ,నస్పూర్ : ఉరి వేసుకొని ఓ యువ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా మరో యువకుడు అదృశ్యమైన ఘటన శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఆర్కే 8 కాలనీకి చెందిన జీజుల అఖిల్(26) ,యస్ మోహన్(26) ఇద్దరు బాల్య స్నేహితులు. ఎస్ఆర్పి 3 గనిలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న అఖిల్ కు జూన్ లో వివాహం జరిగింది. వివాహమై నప్పటికీ అఖిల్,మోహన్ తో స్నేహం ఎప్పటిలాగే కొనసాగిస్తుండడంతో ఇంట్లో వాళ్ళు మందలించారు.బాల్య స్నేహితుడిని విడిచి పెట్టలేక తీవ్ర మనస్తాపంతో అఖిల్ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మోహన్,అఖిల్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేక బంధువులకు,అతని స్నేహితులకు ఫోన్ ద్వారా నేను చనిపోతున్నానని సమాచారం ఇచ్చి అదృశ్యమయ్యాడు.అఖిల్ మృతిపై అతని సోదరుడు అభినవ్,మోహన్ అదృశ్యంపై అతని సోదరుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీరాంపూర్ ఎస్సై కే రాజేష్ తెలిపారు.

Next Story

Most Viewed