అప్పుల బాధతో వలస కూలి ఆత్మహత్య

by Disha Web Desk 23 |
అప్పుల బాధతో వలస కూలి ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ ఎదుట ఉన్న ఎంకే బ్రిక్స్ లో పనిచేసే ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఇర్ఫాన్ ఖాన్ (25)అనే వలస కూలీ బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు గత మూడు నెలల కిందట ఇక్కడ పని చేసేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. ఇక్కడ పనిచేయడం తనకు ఇష్టం లేదు. దీనికి తోడు మద్యానికి ,జల్సాలకు బానిసై అప్పులు చేశాడు. అక్కడికి వెళితే మళ్లీ మద్యానికి బానిస అవుతాడని, జల్సాలకు అలవాటు పడుతాడని, ఇక్కడ పని చేస్తే జీవితం బాగుపడి చేసిన అప్పులు ముడుతాయని స్నేహితులు బంధువులు నచ్చ చెప్పారు. వారి మాటలను వినకుండా, పని చేయడం ఇష్టం లేక అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed