గంజాయి పట్టివేత

by Sridhar Babu |
గంజాయి పట్టివేత
X

దిశ,టేకులపల్లి : టేకులపల్లి మండలం గోలియాతండా, సేవాలాల్ దేవాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 4 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. తురుగొండ కార్తీక్, బిగుల్లా వంశీ కృష్ణ కలిసి డొంకరాయి నుంచి కొత్తగూడెం మీదుగా జనగాం వెళ్తున్నారు. అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు నిందితులు తెలిపారు. ఎస్ఐ సైదా రాహూఫ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story