ఎన్నికలలో పట్టుబడ్డ మద్యం సీసాలు ధ్వంసం

by Sridhar Babu |
ఎన్నికలలో పట్టుబడ్డ మద్యం సీసాలు ధ్వంసం
X

దిశ, మొయినాబాద్ : రాజేంద్రనగర్ జోన్ కు సంబంధించిన ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ సందర్భాలలో పట్టుబడ్డ మద్యం సీసాలను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్ ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ లోని 9 పోలీస్ స్టేషన్ లలో ఇటీవల ఎలక్షన్స్ లో దొరికిన 8551 లీటర్ల మద్యంను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed