కొంపముంచిన చికెన్ షవర్మా.. బాలిక మృతి.. ఐసీయూలో ఫ్యామిలీ!

by Disha Web Desk 4 |
కొంపముంచిన చికెన్ షవర్మా.. బాలిక మృతి.. ఐసీయూలో ఫ్యామిలీ!
X

దిశ, వెబ్‌డెస్క్: షవర్మా ప్రియులకు షాకింగ్ న్యూస్. తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్థానిక హోటల్ లో షవర్మా తిని మృతి చెందడం కలకలం రేపింది. మృతి చెందిన బాలికను డీ.కలైయరసి (14)గా పోలీసులు గుర్తించారు. బాలిక కుటుంబం ఈ నెల 16న హోటల్ నుంచి ఆహార పదార్థాలతో పాటు షవర్మాను పార్సిల్ చేయించి తీసుకెళ్లారు. పార్సిల్ లోని షవర్మా తిన్న తర్వాత బాలికతో పాటు కుటుంబసభ్యులు ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు.

అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లి అడ్మిట్ అయ్యారు. కాగా సోమవారం బాలిక ట్రీట్ మెంట్‌కు స్పందించలేదు. దీంతో వైద్యులు బాలిక మరణించినట్లు ధృవీకరించారు. స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించామన్నారు. కుటుంబ సభ్యులను మెరుగైన వ్యైద్యం కోసం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి అదే హోటల్‌లో షవర్మా తిన్న 13 మంది మెడికల్ విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వారు కూడా ఫిర్యాదు చేశారన్నారు.


Next Story

Most Viewed