ధర్మపురి చైన్ స్నాచర్‌ల ముఠా అరెస్ట్

by Aamani |
ధర్మపురి చైన్ స్నాచర్‌ల ముఠా అరెస్ట్
X

దిశ,వెల్గటూర్ : ధర్మపురి నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న చైన్ స్నాచర్ల మూలంగా బెంబేలెత్తుతున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చైన్ స్నాచర్ల ముఠాను మూడు రోజుల్లో అరెస్టు చేసి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ లో బుధవారం చైన్ స్నాచర్ కు సంబంధించిన ముఠా సభ్యులను డీఎస్పీ రఘు చందర్ అరెస్టు చేసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన సిలిగిరి సందీప్ ముంజ రాజేందర్ అక్షయ్ కుమార్ మాదాస్తు అలేఖ్య అనే భార్యాభర్తలు ఒక ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్ కు పాల్పడి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సందీప్ రాజేందర్ లు గత నెల 30న ధర్మపురి శివారులో దోసకాయలు విక్రయిస్తున్న ఓ మహిళపై ఎటాక్ చేసి పుస్తెల ల తాడు తెంపుకొని పరారయ్యారు. చోరీకి పాల్పడిన చైన్ ను భీంగల్ మండలం లో విక్రయానికి ప్రయత్నించగా అక్కడ ఎవరు తీసుకోలేదు.

దీంతో దొంగతనం చేసిన చైన్ ఎలాగైనా విక్రయించాలని ముఠా లోని నలుగురు వ్యక్తులు రెండు బైకులపై మంచిర్యాలకు కు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో రాయపట్నం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు వీరు వాహనాలపై అనుమానాస్పదంగా కనిపించారు . దొంగల గురించి గురించి అప్పటికే తీవ్రంగా వెతుకుతున్న పోలీసులు తమదైన రీతిలో వీరిని ప్రశ్నించగా చైన్ స్నాచర్ల ముఠా గుట్టు రట్టయింది. దీంతో నలుగురు సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 22 గ్రాముల బంగారం రెండు వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ఉదయ్ కుమార్ ,ఉమా సాగర్ ,సతీష్ ,శ్రీధర్ రెడ్డి కానిస్టేబుళ్లు రామస్వామి రమేష్ వేణు పరమేశ్వర్ టెక్నికల్ సిబ్బంది సీసీ ఫుటేజ్ ల ఆధారంగా విశేషంగా కృషి చేసి మూడు రోజుల్లోనే కేసును చేదించటం విశేషం. వీరిని ఎస్పీ డీఎస్పీ అభినందించారు.



Next Story

Most Viewed