ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు సహా నలుగురు మృతి

by Disha Web Desk 12 |
ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు సహా నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మాధేపురా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన బీహార్‌లో మధుబని జిల్లాలోని ఫుల్‌పరాస్ ప్రాంతంలోని జాతీయ రహదారి 57పై ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధెపురా జిల్లా మేజిస్ట్రేట్ కు చెందిన కారు రోడ్డుపై వెళుతున్న జనాల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మధుబని ఎస్పీ సుశీల్ కుమార్ ప్రకటన

దర్భంగా వైపు వెళుతున్న కారు.. అతివేగంతో దూసుకొచ్చి జనాలపైనుంచి దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన కారును ఎవరు నడిపారో తెలియదు. కారు నడిపిన వారు ప్రమాదం అనంతరం కారును వదిలి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కారు అతివేగంతో వస్తోందని, రోడ్డు దాటుతున్న వ్యక్తుల గుంపును డీ కొట్టకుండా డ్రైవర్ తప్పించడానికి ప్రయత్నించడంతో కారు అదుపుతప్పి అత్యంత వేగంగా వారి మీదనుంచి దూసుకెళ్లింది సాక్షులు చెప్పారని ఆయన అన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మృతుల బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed