ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన ఐదుగురి మృతదేహాలు

by GSrikanth |
ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన ఐదుగురి మృతదేహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తోన్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఉమారియా జిల్లాలోని ఘున్‌ఘటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా ప్రభుత్వ ఉద్యోగులే అని గుర్తించారు. అందరూ పుట్టినరోజు వేడుకకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న నుజ్జునుజ్జైందని తెలిపారు.



Next Story