గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు

by Sridhar Babu |
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు
X

దిశ, రాజేంద్రనగర్ : గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషక్ మహల్ పాత భవనం ప్రాంతంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఐదు మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయితోపాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.Next Story

Most Viewed